: మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కే మా మద్దతు: సీపీఐ
మెదక్ లోక్సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని సీపీఐ ప్రకటించింది. అయితే, ఈ మద్దతు కేవలం మెదక్ ఉపఎన్నిక వరకే పరిమితమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత యథావిథిగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఆయన వ్యాఖ్యానించారు.