: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన కరీంనగర్ వాసి


ప్రపంచంలోని అతి పెద్ద ఇంగ్లిష్ పాలిన్ డ్రోమ్ తయారుచేసిన కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన యార్లగడ్డ పోలీస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ముందు నుంచి వెనక్కి, వెనుక నుంచి ముందుకు చదివే వీలున్న వాక్యాన్ని పాలిన్ డ్రోమ్ అంటారు. ముఖ్యమైన 3,663 పదాలతో ఆయన తయారుచేసిన వాక్యం అతిపెద్ద పాలిన్ డ్రోమ్ గా ప్రపంచ రికార్డు సాధించింది. వాడిన పదం వాడకుండా వాక్య నిర్మాణం చేయడం దీని ప్రత్యేకత. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఎంఏ సోషియాలజీ చదివి, ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న యార్లగడ్డ ఈ పాలిన్ డ్రోమ్ తయారుచేయడానికి ఐదేళ్లు పట్టింది. దీన్ని జులైలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపించారు. వారు గుర్తిస్తూ ఆగస్టు 29న సర్టిఫికెట్ పంపించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలిపిన యార్లగడ్డ పోలీస్... ఈ విషయం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలనలో ఉందని చెప్పారు. త్వరలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదయ్యే అవకాశముందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News