: కరీంనగర్ లో ఆకట్టుకుంటున్న ట్రాఫిక్ వినాయకుడు


వినాయక చవితి సందర్భంగా గణేశ్ నవరాత్రులను హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుతారన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలను నెలకొల్పి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో గణేశ్ మండపాల నిర్వాహకులు కాస్త వైవిధ్యంగా ఆలోచించి... విభిన్న రూపాల్లో విఘ్నాధిపతిని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో నెలకొల్పిన ట్రాఫిక్ వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ యూనిఫారం వేసుకున్న గణనాథుడు ట్రాఫిక్ పై అవగాహనను మరింత పెంచుతున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ యూనిఫారంలో ఉన్న నాలుగు వినాయక విగ్రహాలను మండపంలో ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News