: వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు మనదే... జింబాబ్వేనే కారణం !


కాలం కలసి రావడమంటే ఇదేనేమో! బలహీన జింబాబ్వే జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించడమేంటి? ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా అగ్రపీఠానికి చేరుకోవడమేంటి? వాస్తవానికి ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే ధోనీ సేనకు వన్డేల్లో టాప్ ర్యాంకు దక్కే అవకాశాలున్నాయని తొలుత భావించారు. ఇంగ్లండ్ పై మూడోవన్డేలో నెగ్గిన భారత్ ర్యాంకుల్లో ఆసీస్ సరసన చేరింది. రెండు జట్లకు 114 రేటింగ్ పాయింట్లు ఉండడంతో సంయుక్తంగా టాప్ పొజిషన్ ను పంచుకున్నాయి. అయితే, ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జింబాబ్వే జట్టు ఆసీస్ ను చిత్తు చేయడంతో ర్యాంకింగ్ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆసీస్ 111 పాయింట్లతో మూడోస్థానానికి పడిపోవడం ధోనీ సేనకు లాభించింది. కాగా, ఐసీసీ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (113), ఆస్ట్రేలియా (111), శ్రీలంక (111), ఇంగ్లండ్ (106), పాకిస్థాన్ (100), న్యూజిలాండ్ (98), వెస్టిండీస్ (96), బంగ్లాదేశ్ (69,) జింబాబ్వే (58), ఆఫ్ఘనిస్తాన్ (42), ఐర్లాండ్ (33) ఉన్నాయి. కాగా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల రేటింగ్ పాయింట్లు సమమైనా, దశాంశాల తేడాతో ఆసీస్ మూడో ర్యాంకులో నిలిచింది. లంకేయులు నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యారు.

  • Loading...

More Telugu News