: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి భద్రత పెంపు


కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన వ్యక్తుల జాబితా రూపొందించిన నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామికి 'జడ్' కేటగిరీ సెక్యూరిటీని విస్తరించారు. ఈ నేపథ్యంలో నలభై మంది సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణగా ఉంటారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. ఇంతవరకు తమిళనాడులోనే స్వామి ఈ కేటగిరీ రక్షణను పొందారు. ఇకమీదట దేశంలో స్వామి ఎక్కడికి వెళ్లినా 'జడ్' కేటగిరీ రక్షణ ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల కిందట స్వామి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అనేక వర్గాల నుంచి బెదిరింపులు వస్తున్న కారణంగా తనకు భద్రతను మరింత పెంచాలని అందులో కోరారు.

  • Loading...

More Telugu News