: వరుసకు సోదరులు... వావివరుసలు మరిచారు!


వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సోదరి వరసయ్యే బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించారో ఇద్దరు కామాంధులు. గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారు గుడి తండాకు చెందిన దంపతులకు 13 ఏళ్ళ కుమార్తె ఉంది. నిరక్షరాస్యురాలైన బాలిక పశువుల కాపరిగా ఉంటోంది. పశువులను అడవిలో మేత నిమిత్తం మరో కాపరికి అప్పగించేందుకు తోలుకెళ్లింది. ఇంతలో, అదే తండాకు చెందిన ఇద్దరు యువకులు (ఆమెకు వరుసకు సోదరులు) అడవిలో కాపుకాచి ఆమె నోరు మూసి ఎత్తుకెళ్లారు. భయభ్రాంతులకు గురి చేశారు. వివస్త్రను చేసి బెదిరించారు. ఎలాగో వారి బారినుంచి తప్పించుకున్న యువతి తండాలోకి పరుగుతీసింది. దీనిని గమనించిన మహిళలు బాలికకు చీరకప్పి, విషయం తెలుసుకున్నారు. అనంతరం, బాలిక తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News