: ఆర్థికశాస్త్రంలో భారతీయునికి ప్రతిష్ఠాత్మక అవార్డు
భారత సంతతికి చెందిన 33 ఏళ్ల యువ ఆర్థిక వేత్త రాజ్‌చెట్టి.. ఆర్థిక రంగంలో నోబెల్ తర్వాత.. అంతటి ప్రతిష్ఠాత్మక అవార్డుగా పరిగణించే జాన్‌బేట్స్ క్లార్క్ పతకాన్ని సాధించారు. దీన్ని ఆ రంగంలో బుల్లి నోబెల్‌గా అభివర్ణిస్తారు. ఆర్థిక సిద్ధాంతాలపై అవగాహనకు విశిష్ట సేవలందించిన యువ అమెరికన్లకు సాధారణంగా ఈ పురస్కారం ప్రకటిస్తారు. ఇది పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరిని నోబెల్ కూడా వరిస్తుందని అంటుంటారు. తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డప్పటికీ.. ఢల్లీలోనే పుట్టి పెరిగిన రాజ్ చెట్టి.. చిన్న వయసులోనే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇందుకు గాను ఆయనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసలు కూడా లభించాయి.