: అక్రమ బొగ్గు గనుల భవితవ్యం తేలేది నేడే!


యూపీఏతో పాటు గత ఎన్డీఏ హయాంలోనూ అక్రమ మార్గాల్లో వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల భవితవ్యం నేడు తేలనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం, అక్రమ మార్గాల్లో కేటాయించిన ఈ గనులను కొనసాగించాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే, 2జీ కేసులో స్పెక్ట్రం కేటాయింపులను రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలిచిన నేపథ్యంలో చోటుచేసుకున్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు అక్రమ బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో ధర్మాసనానికి సహాయ పడేందుకు అమికస్ క్యూరీని నియమించుకోవాలని సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీతో పాటు ప్రభుత్వ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నందున మరింత లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని గత నెల 25న సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొగ్గు గనులను ఇప్పటికిప్పుడు రద్దు చేసే అవకశాలు లేవని భావిస్తున్నా, కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News