: విశ్వమానవ కల్యాణానికి జపాన్ సాయం మరువలేనిది: మోడీ
విశ్వమానవ కల్యాణానికి జపాన్ సాయం మరువలేనిదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జపాన్ లో ఆయన హిందీలో మాట్లాడుతూ, ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. జపాన్ పారిశ్రమిక వేత్తలతో సమన్వయానికి భారత పారిశ్రామిక వేత్తల, అధికారుల ప్రత్యేక బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. ప్రధాని ప్రతిపాదనలకు జపాన్ పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జపాన్ తో కలిసి పరిశోధనల రంగంలో పని చేస్తామని మోడీ ప్రతిపాదించారు. భారత్, జపాన్ మధ్య సమన్వయం ప్రపంచ అభివృద్ధి చరిత్రలో కొత్త మలుపని ఆయన వ్యాఖ్యానించారు. సుపరిపాలన తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపిన ఆయన, జపాన్ పారిశ్రామిక వేత్తలతో కలసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.