: యాంకర్ రష్మీ సైట్ కు ఫాలోయర్ల వెల్లువ!


'జబర్దస్త్' టీవీ షో యాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పుడు ప్రముఖ టీవీ యాంకర్లు సుమ, అనసూయలను అధిగమించే స్థాయిలో దూసుకెళుతోంది. ఈ ఏడాది తొలినాళ్లలో ప్రారంభమైన ఆమె అఫీషియల్ వెబ్ సైట్ ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య నానాటికీ శరవేగంగా పెరిగిపోతోందట. ప్రస్తుతం ఈ సంఖ్య పది లక్షల మార్కును దాటింది. దీంతో, అతి తక్కువ కాలంలో అత్యధికంగా ఫాలోయర్లను దక్కించుకున్న వారి జాబితాలో రష్మీ చేరిపోయింది. ఇటీవల పొట్టి ప్యాంటులో ఉన్న తన ఫొటోను సైట్ లో పెట్టిన రష్మీ ఫాలోయర్ల నుంచి ఇబ్బందులెదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న తన టీవీ షో జబర్దస్త్, ఇటీవలే 75 ఎపిసోడ్లను ముగించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ షో ద్వారానే రష్మీ ప్రముఖ యాంకర్ గా పేరొందింది.

  • Loading...

More Telugu News