: 'శ్రీరామరాజ్యం'లో నటించడం నా అదృష్టం: బాలకృష్ణ
దర్శకుడు బాపు మృతికి నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. బాపు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆయన కుంచె నుంచి జాలువారిన సీతారాముల వర్ణ చిత్రాలు మణిమకుటాలని అభివర్ణించారు. పౌరాణిక, సాంఘిక చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనది అందెవేసిన చేయి అని వ్యాఖ్యానించారు. తెలుగునాట, తెలుగునోట బాపు పేరు అజరామరం అని అభిప్రాయపడ్డారు.