: 'కోల్ గేట్' స్కాంపై సుప్రీంలో మంగళవారం కీలక విచారణ!


యూపీఏ హయాంలో సంచలనం రేకెత్తించిన 'కోల్ గేట్' కుంభకోణంలో మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో బడా పారిశ్రామికవేత్తల పాత్ర నేపథ్యంలో అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్న తీరుపై సీబీఐ సుప్రీం ధర్మాసనం ముందు ఏకరువు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 2జీ కేసులో కొందరు ఉద్దేశపూర్వకంగానే కీలక విషయాలను మీడియాకు చేరవేస్తూ విచారణను సుదీర్ఘకాలం కొనసాగేలా చేస్తుండటంపైనా సీబీఐ, సుప్రీం కోర్టుకు విన్నవించనున్నట్లు సమాచారం. అంతేగాక, న్యాయవిచారణలో సీబీఐ ఎలాంటి జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు సీబీఐ తరఫు న్యాయవాది సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాటా-యూనీటెక్ ఒప్పందంపై సీబీఐ తనవద్ద ఉన్న పూర్తిస్థాయి ఆధారాలను ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కు అందజేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాటి విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కోల్ గేట్ తో పాటు 2జీ కేసు విచారణపైనా సీబీఐకి స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News