: కాలేజీ టూర్లపై యూజీసీ కొరడా!
విద్యార్థుల కోసం కళాశాలలు నిర్వహించే టూర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొరడా ఝుళిపించనుంది. బియాస్ నది దుర్ఘటన నేపథ్యంలో యూజీసీ ఈ తరహా చర్యకు ఉపక్రమించింది. ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నట్లు యూజీసీ వైస్ ఛైర్మన్ దేవరాజ్ చెప్పారు. వివిధ టూర్లలో విద్యార్థుల భద్రతకు కళాశాల యాజమాన్యం చేపట్టాల్సిన చర్యలపై నిబంధనలు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తప్పనిసరి అయిన టూర్లకు మాత్రమే అనుమతి మంజూరు చేసే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నట్లు శనివారం హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఆయన చెప్పారు. ఈ విషయంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు తదితరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామని దేవరాజ్ వెల్లడించారు.