: ప్రపంచంలో భారత్ అగ్రగామిగా మారబోతోంది: బాబు


ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా మారబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులోని హైటెక్స్ లో నిర్వహించిన ఐఈఐఏ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశాన్ని అగ్రస్థానాన నిలిపేందుకు మోడీ నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 14 ఎయిర్ పోర్టులు, 14 స్మార్ట్ సిటీలను అన్ని సాంకేతిక హంగులతో నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఏపీలోని ప్రతి గ్రామానికి గ్యాస్, రక్షిత మంచినీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News