: ఖైరతాబాద్ గణేషుడిపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపిస్తాం: కేసీఆర్
హైదరాబాదులోని ఖైరతాబాదు గణనాధునిపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులోని ఖైరతాబాద్ వినాయకుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణపతి దయతో బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షించారు. గణేషుడి కరుణా కటాక్షాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఉండాలని కోరారు. సీఎంతో పాటు హోం మంత్రి నాయిని, మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలు, నేతలు ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్నారు.