: నా వ్యాఖ్యల్ని మతపరంగా కాదు, జాతిపరంగానే చూడండి: నజ్మా హెప్తుల్లా
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా వివాదంలో చిక్కుకున్నారు. భారతీయులంతా హిందువులే అనే అర్ధం వచ్చేలా నజ్మా వ్యాఖ్యలు చేశారంటూ వివాదం రేగింది. దీంతో ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాను 'హిందూ' అనలేదని, 'హిందీ' అన్నానని అన్నారు. తన వ్యాఖ్యలు మతపరమైనవిగా కాకుండా, జాతిపరమైనవిగా చూడాలని ఆమె సూచించారు. 'సారె జహాసె అచ్ఛా' గీతంలోని 'హిందీ హై హమ్... వతన్ హై హిందూసితా హమారా'... అన్న చరణం ఆమె గుర్తు చేశారు.