: డెవిల్స్ ను భయపెడుతోన్న గేల్
ఢిల్లీ డేర్ డెవిల్స్.. స్టార్లున్నా లక్ లేని జట్టు ఇది. అందుకే ఐపీఎల్ తాజా సీజన్ లో ఒక్కటంటే ఒక్క విజయమూ నమోదు చేసుకోలేకపోయింది. సెహ్వాగ్, జయవర్ధనే, వార్నర్, ఇర్ఫాన్ పఠాన్, మోర్కెల్ వంటి ఉద్ధండులున్నా గెలుపు ఎండమావిలా ఊరిస్తోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లాడి అన్నింటా ఓడి పాయింట్ల పట్టికలో చివర నిలిచిందీ జట్టు. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సాధించింది భారీ స్కోరు కాకపోవడంతో ఢిల్లీ భయపడుతోంది. ప్రత్యర్థి జట్టులో విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఉండడమే అందుకు కారణం. గేల్ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడంలో మాస్టర్ అన్న సంగతి డేర్ డెవిల్స్ కు బాగా తెలుసు. అందుకే అతన్ని కట్టడి చేసేందుకు తగిన ప్రణాళికలతో ఫీల్డింగ్ బరిలో దిగుతోంది.