: వైఎస్సార్సీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
హైదరాబాదులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి విజయసాయిరెడ్డి పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు.