: చర్లపల్లి డిప్యూటీ జైలర్ పై క్రమశిక్షణ చర్యలు
హైదరాబాదు సమీపంలోని చర్లపల్లి జైలులో ఖైదీలు సెల్ ఫోన్లు వినియోగిస్తున్న విషయం ఆధారాలు సహా బయటపడటంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. డిప్యూటీ జైలర్ రాహుల్ పై అధికారులు బదిలీ వేటు వేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.