: కొత్త పెళ్లి కూతురుపై ఆడపడుచు భర్త అత్యాచారం
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో కొత్త పెళ్లికూతురు సొంత ఇంట్లోనే అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘజియాబాద్ లో ఓ యువతికి షాన్ మహ్మద్ అనే యువకుడితో ఈ మధ్యే పెళ్లైంది. పెళ్లి తరువాత రక్తసంబంధీకుల ఇంటికి వెళ్లే సంప్రదాయం ప్రకారం స్థానిక షహీద్ నగర్ లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి భార్య, భర్త కలసి వెళ్లారు. బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో భర్త షాన్ మహ్మద్, ఆడపడుచు రేష్మా సహకారంతో ఆమె భర్త షంషాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు ముగ్గుర్ని అరెస్టు చేశారు.