: పవన్ కల్యాణ్ మెదక్ ప్రచారానికి వస్తే రాళ్ల దాడి చేస్తాం: ఓయూ జేఏసీ వార్నింగ్
తెలంగాణ వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉన్న ఓయూ జేఏసీ ఉపఎన్నికల నేపథ్యంలో మళ్లీ క్రియాశీలకంగా మారింది. ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓయూ జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. జగ్గారెడ్డి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేయడానికి మెదక్ వస్తే, రాళ్ల దాడి చేస్తామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. పవన్ కల్యాణ్ ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రచారానికి వస్తే వినేవారు ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు. ఉద్యమపార్టీ టీఆర్ఎస్ కే తమ మద్దతు ఉంటుందని ఓయూ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఇక, మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. రాజకీయపార్టీల మధ్య వ్యూహాలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ కవిత టీడీపీ-బీజేపీ పొత్తు అనైతికమని వ్యాఖ్యానించారు. సమైక్యవాదైన జగ్గారెడ్డికి బీజేపీ ఎలా టికెట్ కేటాయించిందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు.