: ముంబయి ఆసుపత్రిలో లాలూను పరామర్శించిన మంత్రి జైట్లీ


ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల కిందట అనారోగ్యం కారణంగా లాలూ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయనకు హార్ట్ సర్జరీ చేయాలని నిర్ణయించడంతో నిన్న (బుధవారం) ఆరు గంటలకు పైగా వైద్యులు ఆపరేషన్ ప్రక్రియ నిర్వహించారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పదిపన్నెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో లాలూ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర బీజేపీ నేతలు ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News