: 'ఇంటర్ పోల్' అంబాసడర్ గా షారూఖ్ ఖాన్


నేరగాళ్ళకు సింహస్వప్నంగా నిలిచే అంతర్జాతీయ సంస్థ 'ఇంటర్ పోల్'. ఇప్పుడీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ వ్యతిరేక ప్రచారం నిర్వహించ తలపెట్టింది. ప్రచారంలో భాగంగా వరల్డ్ క్లాస్ సెలబ్రిటీలు నేరాలకు వ్యతిరేకంగా తమ గళం వినిపించనున్నారు. ఈ అరుదైన అవకాశం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కు కూడా లభించింది. దీనిపై, షారూఖ్ మాట్లాడుతూ, ఇంటర్ పోల్ అంబాసడర్ గా ఎంపికవడం ఓ అరుదైన గౌరవం అని పేర్కొన్నాడు. నేరాలను సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చాడు. కాగా, షారూఖ్ తో పాటు యాక్షన్ హీరో జాకీ చాన్ కూడా ప్రచారంలో పాల్గొంటాడు. సాకర్ స్టార్ లయొనెల్ మెస్సీ, ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో, కిమి రైక్కోనెన్ ఇప్పటికే ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారు. మాదకద్రవ్యాల రవాణా, మనుషుల అక్రమ తరలింపు, మోసాలు, సైబర్ నేరాలు, కిడ్నాప్ లు, బాలలపై నేరాలు వంటి అంశాలను ఇంటర్ పోల్ తన ప్రచారంలో పొందుపరిచింది.

  • Loading...

More Telugu News