: భార్య వల్ల ఒడిశా మంత్రికి శిరోభారం


ఒడిశా మంత్రికి భార్య చేసిన పని శిరోభారంగా తయారైంది. ప్రస్తుత ఒడిశా రెవెన్యూ, విపత్తు శాఖ మంత్రి బిజయశ్రీ రౌత్రే 1987లో భువనేశ్వర్ లో విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన యూనిట్ 3 ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం కోసం కొంత భూమిని ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. అతని భార్య వైద్యురాలు కావడంతో ఆమె ఆసుపత్రిని కొంత కాలం నడిపారు. అనంతరం ఆసుపత్రిని మూసేసి వాణిజ్య అవసరాలకోసం వినియోగిస్తున్నారు. దీంతో చట్ట విరుద్ధంగా ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నారంటూ ప్రతిపక్షం ఎండగడుతోంది. వారికి సమాధానంగా మంత్రిగారు తాము ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించలేదని, అక్కడ తప్ప ఇంకెక్కడా తమకు స్థలం లేదని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News