: ఇలా లాభం లేదని ఏకంగా ఏటీఎంనే లేపేశారు
ఏటీఎంల వద్దకెళ్లడం... అక్కడ కాపలాదారుణ్ణి ఏదోటి చేయడం...ఇంతలో ఎవరైనా రావడం ఇబ్బందనుకున్నారో ఏమో కానీ చోరులు ఏకంగా ఏటీఎంనే లేపేశారు. పంజాబ్ లోని మెగా-ఫిరోజ్ పూర్ రోడ్డులో సెక్యూరిటీ గార్డును కొట్టి, కళ్లలో రసాయనాలు చల్లి ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో లబోదిబోమన్న సెక్యూరిటీ గార్డును ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని, కళ్లు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. కాగా, వారు ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 1,70,000 రూపాయలు ఉన్నాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.