: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిద్ధం


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం గానీ... లేదా, రేపు ఉదయం గానీ తన నివేదికను శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోంశాఖకు అందజేయనుంది. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఏర్పాటుపై నిర్దిష్టమైన ప్రతిపాదన ఏదీ చేయలేదని సమాచారం. కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నాలుగైదు ప్రదేశాలను కమిటీ సూచించిందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఈ నాలుగైదు ప్రదేశాలకు సంబంధించిన సానుకూల అంశాలు, ప్రతికూలాంశాలు ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదికను త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుంచి... రాజధానిపై ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాలని కేంద్రహోంశాఖ భావిస్తోంది.

  • Loading...

More Telugu News