: చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
చెన్నై విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయాన్ని మానవ బాంబు ద్వారా పేల్చివేయనున్నామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం, దాని పరిసరాలను అణువణువూ శోధించారు. బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే రకంగా బెదిరింపు రావడం విశేషం. ప్రస్తుతానికి పోలీసులు ఫోన్ కాల్ పై దర్యాప్తు చేస్తున్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు అన్ని విమానాశ్రయాలకు భద్రత పెంచారు. కాగా, ఆ భద్రతను వినాయకచవితి వరకు కొనసాగిస్తున్నట్టు సమాచారం.