: రాజ్ నాథ్ సింగ్ కు మోడీ సపోర్ట్
రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ పై ఆరోపణల వ్యవహారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రాజ్ నాథ్ తనయుడు, ఇతర కేంద్ర మంత్రులపై జరుగుతున్నది దుష్ప్రచారం అని మోడీ పేర్కొన్నారు. మంత్రులపై బురదజల్లడం ద్వారా కేంద్రం ప్రతిష్ఠను దిగజార్చాలని కొన్ని వర్గాలు భావిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి చర్యల ద్వారా జాతి ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అవినీతికి పాల్పడిన కారణంగానే రాజ్ నాథ్ తనయుడికి యూపీలో నోయిడా లోక్ సభ టిక్కెట్ నిరాకరించారని మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.