: విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘మర్ధానీ’
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ నటించిన 'మర్ధానీ' చిత్రం బీహార్ పోలీసులకు స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల విడుదలైన మర్దానీ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. పోలీసులందరూ మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకునేందుకు ఆ చిత్ర ప్రదర్శనను బీహార్ లోని అన్ని జిల్లాల ఎస్పీలు, బీహార్ మిలటరీ పోలీసు కమాండెంట్స్ లకు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ఐజీ అరవింద్ పాండే ఆదేశించారు. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంతో రూపొందించిన ఈ సినిమాను చూసి పోలీసులు పాఠాలు నేర్చుకోవాలని అరవింద్ పాండే అన్నారు. మహిళల, పసిపాపల అమ్మకాలు లాంటి నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.