: వాకౌట్ పై వైకాపా సభ్యుడికి క్లాస్ పీకిన స్పీకర్


వాకౌట్ అంటే ఏమిటనే విషయంపై వైకాపా సీనియర్ సభ్యుడు జ్యోతుల నెహ్రూకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్లాసు పీకారు. ఒక అంశాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసిన వారు... మళ్లీ అదే అంశంపై సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని స్పీకర్ తెలిపారు. రైతు రుణమాఫీ అంశంపై వాకౌట్ చేస్తున్నట్టు వైకాపా ప్రకటించింది. దీంతో సభ్యులందరూ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే, జ్యోతుల నెహ్రూ మాత్రం సభ గేటు దాకా వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో, టీడీపీ సభ్యులు నెహ్రూపై సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, వాకౌట్ చేసిన వారు సభలో కూర్చుంటే తనకు అభ్యంతరం లేదని... వాకౌట్ చేయలేదని చెప్పి మాట్లాడవచ్చని సూచించారు.

  • Loading...

More Telugu News