: రంగారెడ్డి జిల్లాలో వర్షం... పలు బస్సు సర్వీసులు రద్దు
రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగిలో భారీ వర్షం కురవడంతో వాగులు పొంగాయి. దీంతో పలు రూట్లలో బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. పరిగి-మహబూబ్ నగర్, పరిగి - షాధ్ నగర్, తాండూరు-మహబూబ్ నగర్ రూట్లలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.