: విఘ్నాధిపతికి 75 అడుగుల పొడవైన కండువా
హైదరాబాదు ఖైరతాబాదులో ప్రతి యేటా భారీ గణనాథుడిని ప్రతిష్టించి అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఖైరతాబాద్ లో కొలువుదీరనున్న విఘ్నాధిపతి కోసం 75 అడుగుల కండువాను సిద్ధం చేశారు. నల్గొండకు చెందిన కర్నాటి యాదగిరి 3,116 శివలింగాలతో ఈ పెద్ద కండువాను తయారుచేశారు. దీనిని రూపొందించేందుకు మూడేళ్ల సమయం పట్టిందని, మహా గణపతికి కానుకగా సమర్పిస్తున్నట్లు యాదగిరి తెలిపారు. 2012 సంవత్సరంలో 71 అడుగుల కండువా తయారుచేశారు. 2013లో 73 అడుగుల ఇంద్రధనుస్సు రంగులతో కండువాను రూపొందించగా, ఈ ఏడాది ఆయన 75 అడుగుల పొడవైన కండువాను భారీ గణనాథుడికి సమర్పించేందుకు సిద్ధం చేశారు.