: రాజధాని ఎక్కడో మారుమూల ఉండదు... సెంటర్ లోనే ఉంటుంది: ఢిల్లీలో చంద్రబాబు
నూతన రాజధాని ఎక్కడో మారుమూల ఉండదని... అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ కు మధ్యలో ఉంటుందని చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. రాజధానిగా ఎక్కడ ఏర్పాటు చేసినప్పటికీ.... ఏపీలో ప్రతీ ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకే రాజధానిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. విభజన వల్ల ఏపీకి వచ్చిన ఆదాయలోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరానని చంద్రబాబు తెలిపారు.