: ఫాస్ట్ బౌలర్ ను క్లీన్ బౌల్డ్ చేసిన ఫ్యాషన్ డిజైనర్


టీమిండియా బ్రహ్మచారి ఉమేశ్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన మనసు దోచిన ఫ్యాషన్ డిజైనర్ గాళ్ తాన్యా వాధ్వాతో నిశ్చితార్థం చేసుకున్నాడీ ఫాస్ట్ బౌలర్. నాగ్ పూర్ లో నిన్న తన ఇంట్లోనే ఈ కార్యక్రమాన్ని అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో కానిచ్చేశాడట ఈ యువ పేసర్. మే 29న వీరి వివాహ విందు కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. కాగా, తాన్యాతో తన పరిచయం మూడేళ్ళ కింద జరిగిందని వెల్లడించాడు ఉమేశ్. అయితే తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదంటున్నాడు. ఓ ఏడాది క్రితమే తన ప్రేమ గురించి ప్రేయసితో చెప్పినట్టు ఉమేశ్ చెప్పాడు. ఇక ఈ జోడీ పెళ్ళికి సిద్ధపడడం పట్ల ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News