: రజనీకాంత్ మావాడే: బీజేపీ ధీమా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం తాము వెంపర్లాడుతున్నట్టు వస్తున్న వార్తలను బీజేపీ తమిళనాడు శాఖ ఖండించింది. ఆయన తమవాడే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. రజనీ పట్ల పార్టీ వర్గాల్లో సదభిప్రాయం ఉందని, పార్టీలోకి ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో రజనీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి జయలలిత ప్రాభవానికి గండికొట్టాలని బీజేపీ భావిస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. ఈ కథనాలపైనే సౌందరరాజన్ స్పందించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ... రజనీని కలిశారని ఆమె తెలిపారు. బీజేపీ తమిళనాడు శాఖ పగ్గాలు చేపట్టిన అనంతరం, తొలిసారిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసేందుకు ఆమె నేడు ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాజా వ్యాఖ్యలు చేశారు.