: రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తా: విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నరుగా నియమితులైన బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావుకు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తానని అన్నారు. ఈ పదవికి ఎంపిక చేసిన బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ పరిధిలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనున్నట్లు ఆయన తెలిపారు.