: విద్యాసాగర్ రావు గవర్నరుగా నియమితులవ్వడం రాష్ట్రానికి గర్వకారణం: కిషన్ రెడ్డి
బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నరు పదవి వరించడం సంతోషదాయకమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో విద్యాసాగర్ రావుకు ఘనస్వాగతం లభించింది. ఇంతకు మునుపు ఆయన కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నాయకుడిగా అనేక పదవులను నిర్వహించారని కిషన్ రెడ్డి చెప్పారు. విద్యాసాగరరావుకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఆయన గవర్నరుగా నియమితులవ్వడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.