: దర్శకుడు అటెన్ బరో మృతికి కరుణానిధి నివాళులు
ఎనిమిది ఆస్కార్ అవార్డులు పొందిన 'గాంధీ' చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో మృతిపట్ల డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, 'గాంధీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన తర్వాత అటెన్ బరో భారతదేశం, విదేశాల్లో మంచి పాప్యులారిటీ సంపాదించుకున్నారన్నారు. ఆ చిత్రంలో గాంధీ కీర్తిని, ఆయన గురించిన పలు విషయాలపై అవగాహన కల్పించడం ద్వారా దర్శకుడిగా ఘనత వహించారని కరుణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తన తరపున, పార్టీ తరపున సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని ఆయన చెప్పారు.