: భారత్ లో బాల్య వివాహాల నిర్మూలనకు మరో 50 ఏళ్లు పడుతుందట!
గత రెండు దశాబ్దాల నుంచి భారత్ లో బాల్య వివాహాల క్షీణత కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా అరికట్టడానికి మరో యాభై ఏళ్లు పడుతుందని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) చెబుతోంది. "గత రెండు దశాబ్దాల నుంచి బాల్య వివాహాలు ప్రతి ఏడాదికి ఒక శాతం తగ్గుతున్నాయి. కానీ, ఈ తగ్గుదల చాలా నెమ్మదిగా ఉండడం వల్ల ఈ రేటు ఏర్పడింది. పూర్తిగా అరికట్టడానికి మరో 50 ఏళ్లు లేదా ఇంకా సమయం పడుతుంది" అని యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ అని డోరా గియస్టీ పేర్కొన్నారు. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ అని, అప్పటికల్లా మిలియన్ల మంది అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటారని వివరిస్తూ దేశంలోని పరిస్థితిని హెచ్చరించారు. అయితే, 20 నుంచి 24 సంవత్సరాలున్న మహిళలు దాదాపు 43 శాతం మంది పద్దెనిమిదేళ్లకు ముందే వివాహం చేసుకున్నారన్నారు. వారిలో ఐదుగురిలో ఇద్దరు బాల్యంలోనే పెళ్లి చేసుకున్నారని ఓ సర్వేలో తేలిందని ఆమె వివరించారు. ఇలా దేశంలో బాల్య వివాహాల దుస్థితి గురించి ఆయన సవివరంగా చెప్పారు.