: లాలూకు కార్డియాక్ సర్జరీ అవసరమంటున్న వైద్యులు


అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కార్డియాక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. లాలూ ఛాతీ సంబంధ సమస్యతో సోమవారం ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో చేరారు. లాలూ ఆరోగ్యంపై ఆసుపత్రి మెడికల్ డైరక్టర్ డాక్టర్ విజయ్ డిసిల్వా మాట్లాడుతూ, ప్రాథమిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అనంతరం, ఆయనకు శస్త్రచికిత్స అవసరమని భావిస్తున్నామని తెలిపారు. లాలూజీ మామూలుగా ఆరోగ్యవంతుడే అని, అయితే, ఇటీవల ఎన్నికల సందర్భంగా అలుపెరుగని ప్రచారంతో ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలిపారు.

  • Loading...

More Telugu News