: అమెజాన్ ఐటీ కంపెనీలో మరణించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్


అమెజాన్ ఐటీ కంపెనీ హైదరాబాద్ కార్యాలయంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రతీక్ హోరా(22) ఐఐటీ గౌహతీలో పట్టభద్రుడయ్యారు. క్యాంపస్ సెలెక్షన్స్ క్రాక్ చేసి అమెజాన్ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించారు. జూలై 14 నుంచి ఆయన విధులకు హాజరవుతున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆరోగ్యం సరిగా లేదని చెప్పి ఆదివారం కార్యాయలంలోని విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లారు. సోమవారం ఉదయం హౌస్ కీపింగ్ బోయ్ వచ్చి చూసేసరికి ఆయన అచేతనంగా పడి ఉన్నారు. దీంతో పై అధికారులకు సమాచారం అందించారు. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలికి చేరుకుని అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రతీక్ ముక్కు నుంచి రక్తం, నోటి నుంచి నురగలు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News