: గ్యాస్ ధర పెంపుకు గ్యాస్ ఉత్పత్తి సంస్థల డిమాండ్


ఎట్టి పరిస్థితుల్లోను దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు ధరను వెంటనే పెంచాలని గ్యాస్ ఉత్పత్తి కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ కు చెల్లిస్తున్న 4.2 డాలర్ల ధర మార్కెట్ ధరకన్నా చాలా తక్కువని ఈ సంస్థలు తెలుపుతున్నాయి. ప్రముఖ కంపెనీలు రిలయన్స్, బీపీ, ఓఎన్జీసీ, కెయిర్న్ లు ధర పెంపుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ధర తక్కువగా ఉండటంతో, ఇప్పటికే గుర్తించిన డజనుకు పైగా గ్యాస్ క్షేత్రాల్లో కార్యకలాపాలను చేపట్టలేకపోతున్నామని ఈ సంస్థలు చెబుతున్నాయి. ధర పెంపు విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని... ఇలాంటి పరిణామాలతో తమ అభివృద్ధి కుంటుబడుతుందని అంటున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం కానుంది.

  • Loading...

More Telugu News