: అమెరికా పర్యటనలో మోడీ రికార్డుల మోత ఖాయమే!


మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజార్టీ సాధించిన నరేంద్ర మోడీ ఇప్పటికే తన పేరిట అరుదైన రికార్డును నమోదు చేసుకున్నారు. తాజాగా వరుస రికార్డులను మోత మోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. తన అమెరికా పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ, న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో సెప్టెంబర్ 28న జరగనున్న బహిరంగ సభలో 25 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తద్వారా అమెరికా గడ్డపై బహిరంగ సభలో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా రికార్డును కైవసం చేసుకోనున్నారు. ఇప్పటిదాకా భారత ప్రధాని హోదాలో ఏ ఒక్కరు కూడా అమెరికాలో ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొనలేదు. దాదాపు 25 వేల మందికి పైగా ఈ బహిరంగ సభకు హాజరు కానున్నట్లు బీజేపీ ప్రవాస వ్యవహారాల కమిటీ సభ్యులు విజయ్ జోల్లీ, రాజ్యవర్ధన్ రాథోడ్ లు పేర్కొన్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు సీట్లను బుక్ చేసుకున్నారు. ప్రవాస భారతీయులే కాక అమెరికా కాంగ్రెస్ సభ సభ్యులు కూడా సభకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. మోడీ బహిరంగ సభకు సంబంధించిన ప్రచారాన్ని విజయ్, రాథోడ్ లు ముమ్మరంగా సాగిస్తున్నారు. మోడీని ప్రత్యేకంగా లాస్ ఏంజెలెస్ కు ఆహ్వానించనున్నట్లు ఆ నగర మేయర్ వీరితో చెప్పారట. ఇదిలా ఉంటే, అమెరికాలో మోడీ పర్యటనకు సంబంధించి ఓ ప్రత్యేక వెబ్ సైట్ కూడా రూపుదిద్దుకుంది.

  • Loading...

More Telugu News