: సినిమా చూస్తే 'పవర్' స్టార్ ఆడియో సీడీ ఫ్రీ
పవర్ స్టార్ అంటే టాలీవుడ్ పవర్ స్టార్ కాదు, శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఈయన నటించిన 'పవర్' కన్నడ సినిమా ఆగస్టు 28న అభిమానుల ముందుకు రానుంది. దీంతో, ఈ సినీ నిర్మాతలు కొత్త ప్రచారానికి తెరదీశారు. ఈ సినిమాకు సంబంధించిన 5 లక్షల ఆడియో సీడీలు సినిమా చూసిన ప్రేక్షకులకు పంచుతామని ప్రకటించారు. కన్నడనాట పవర్ స్టార్ గా మన్ననలందుకుంటున్న పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో ఆవిష్కరించింది సూపర్ స్టార్ మహేష్ బాబు!