: ఏపీ ప్రభుత్వానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 'డెడ్ లైన్'


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) డెడ్ లైన్ విధించింది. సెప్టెంబర్ 11లోగా ఆర్టీసీ సొసైటీకి చెల్లించాల్సిన రుణ బకాయిలను చెల్లించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాదులోని విద్యాపురంలో ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. పెట్టిన గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆ తేదీ నుంచి ఏపీలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఈయూ నేతలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News