: 'బాబు వస్తాడు, బంగారం విడిపిస్తాడు' అని టీవీల్లో, పత్రికల్లో ఊదరగొట్టారు: జగన్
చంద్రబాబు రుణమాఫీ చేస్తే తనకంటే ఆనందపడేవారుండరని వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. రుణమాఫీ కోసం కోటి మందికి పైగా రైతులు, 70 లక్షల మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో బూటకపు హామీలతో టీడీపీ నాయకులు ఊదరగొట్టారని చెప్పారు. 'బాబు వస్తాడు, బంగారం విడిపిస్తాడు' అని టీవీ చానళ్లలో, పత్రకల్లో ఊదరగొట్టారని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ పంచారని చెప్పారు. అయితే మాట తప్పడం చంద్రబాబు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.