: కొత్త ఫార్మాట్ లో విడుదలవుతున్న 'శంకరాభరణం'
క్లాసికల్ కథతో ప్రేక్షకులను అలరించి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన 'శంకరాభరణం' మళ్లీ మన ముందుకు రాబోతుంది. దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ చిత్రం త్వరలో తమిళంలో విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇందుకోసం సినిమాలో కలర్ కరెక్షన్ చేసి స్కోప్ లోకి మార్చడం, రీ రికార్డింగ్ పాతనోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లోకి మార్చడం జరుగుతోంది. దాదాపు సంవత్సరంపాటు కష్టపడి చిత్రాన్ని ఆధునిక సాంకేతి పరిజ్ఞానంతో కొత్తగా తీసుకొస్తున్నారట. ఈ డిజిటల్ వెర్షన్ ను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.