: ఆస్కార్ మూవీ 'గాంధీ' దర్శకుడి కన్నుమూత


'గాంధీ' సినిమా ద్వారా మహాత్ముడి జీవితాన్ని అత్యద్భుత రీతిలో తెరకెక్కించిన బ్రిటీష్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆరోగ్యం క్షీణించడంతో తన తండ్రి ఆదివారం నాడు మరణించారని అటెన్ బరో కుమారుడు మైకేల్ తెలిపారు. 1982లో విడుదలైన 'గాంధీ' సినిమాతో అటెన్ బరో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు. అకాడెమీ అవార్డుల్లో 'గాంధీ' చిత్రం 'ఉత్తమ సినిమా' సహా 8 విభాగాల్లో జయకేతనం ఎగరవేయడం విశేషం. ఈయన మంచి నటుడు కూడా. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అటెన్ బరో మరణం పట్ల బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ స్పందించారు. సినిమా రంగానికి చెందిన మహోన్నత వ్యక్తుల్లో అటెన్ బరో ఒకరని కీర్తించారు.

  • Loading...

More Telugu News