: అమిత్ షా 'మిషన్ 44+' పర్యటన నేపథ్యం... బీజేపీ, ఎన్సీ వర్గీయుల మధ్య ఘర్షణ


జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సరిహద్దు గ్రామాల ప్రజల పునరావాస కేంద్రం వద్ద ఈ ఘర్షణ జరిగింది. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆర్ఎస్ పురా సెక్టార్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యటనలో భాగంగా పాక్ బలగాల కాల్పుల బాధితులను అమిత్ షా పరామర్శించనున్నారు. 'మిషన్ 44+' పేరుతో రెండు రోజుల జమ్మూకాశ్మీర్ పర్యటనకు అమిత్ షా శ్రీకారం చుట్టారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 87 స్థానాలకు గానూ... అధికారం చేపట్టడానికి అవసరమైన 44 లేదా అంతకన్నా ఎక్కువ స్థానాలకు కైవసం చేసుకోవడం 'మిషన్ 44+' లక్ష్యం. ఈ మిషన్ లో భాగంగా, నేడు ఆర్ఎస్ పురా సెక్టార్ లో బీజేపీ అధ్యక్షుడు పర్యటిస్తున్నారు. అయితే, గత రాత్రి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న బీఎస్ఎఫ్ స్థావరాలపై పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి.

  • Loading...

More Telugu News