: ప్రారంభమైన శాసనసభ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేటి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ సజావుగా సాగడానికి సభ్యులందరూ సహకరించాలని స్పీకర్ కోడెల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ, నిరసన వ్యక్తం చేయడానికి కూడా తమకు అవకాశం కల్పించడం లేదని అన్నారు. అందరికీ అవకాశం కల్పిస్తామని... సభకు అంతరాయం కల్పించరాదని స్పీకర్ కోరారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.